English   

ఎన్టీఆర్ బయోపిక్ మీద తేజ షాకింగ్ కామెంట్స్ !

Teja
2019-01-28 09:52:42

మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినీ ఇండస్ట్రీకి మూల స్థంభం లాంటి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను డైరెక్టర్ తేజ దర్శకత్వంలో మొదట షూట్ మొదలు పెట్టన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఈ బయోపిక్‌ను తీయగలననే పూర్తి నమ్మకం లేక తప్పుకున్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు. అయితే ఈ సినిమాలో మొదటి భాగం రిలీజ్ కావడం కూడా జరిగిపోయింది. ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్, టీజర్‌ లు ఇంకా బాగుండడంతో సినిమా ఘన విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే విడుదలయ్యాక ఫలితం తల కిందులు అయ్యింది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందినా ప్రేక్షకులు మాత్రం ఆశించినంతగా ఆదరించలేదు. దీంతో ప్రీరిలీజ్ బిజినెస్‌లో కనీసం మూడోవంతు కూడా వెనక్కు రాబట్టలేక నీరస పడింది. దీంతో ఈ సినిమాపై తేజ ఎలా స్పందిస్తారన్న దానిపై సగటు సినీ ప్రేక్షకుడితో పాటు సినీ ప్రముఖుల్లోనూ ఆసక్తి నెలకొంది. దీనిపై ఇటీవల తేజను మీడియా ప్రశ్నించగా షాకింగ్ సమాధానమిచ్చారు. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ సీత పనుల్లో బిజీగా ఉన్నానని, అందువల్లే కథానాయకుడు సినిమా చూడలేదని చెప్పారు తేజ.  సినిమాలో ఇంకాస్త డ్రామా ఉంటే బాగుండేదా? అని ప్రశ్నించగా అది దర్శకుడిపై ఆధారపడుతుంది. ఆయనే తన పనితనాన్ని చూపించాలని, తాను సినిమా చూడనందువల్ల ఇంతకుమించి మాట్లాడలేనని ఆయన పేర్కొన్నారు. అయితే ఒక మూడు గంటలు సమయం కూడా కేటాయించలేనంత బిజీ ఏమిటో.
   

More Related Stories