English   

టాలీవుడ్ లో యాంటిక్ ట్రెండ్...అన్నీ ఆ సినిమాలే !

majili
2019-01-28 17:18:13

ఒక్కొక్కప్పుడు ఒక్కో రకం ట్రెండ్  సినిమా ఫీల్డ్ లో నడుస్తూ ఉంటుందిటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పీరియాడికల్  మూవీస్, దేశభక్తి, బయోపిక్ ల హవా నడుస్తోంది. తెలుగు స్టార్స్ కూడా అందరూ పీరియాడిక్ సినిమాల మీదే ద్రుష్టి పెడుతున్నారు. ఈ ట్రెండ్ కి ముందుగా ఒక రకంగా నారా రోహిత్ రిబ్బన్ కటింగ్ చేస్తే దీన్ని మిగతా హీరోలు అందుకున్నారు. 2016 డిసెంబర్ ఆఖరులో అప్పట్లో ఒకడు ఉండేవాడు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రోహిత్, ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు కొల్లగొట్టక పోయినా ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టింది. ఇక దాన్ని బాలకృష్ణ గౌతమీ పుత్రా శాతకర్ణితో కంటిన్యూ చేయగా రీసెంట్ గా రామ్ చరణ్ ఎనభైల్లోకి తీసుకెళ్ళి 'రంగస్థలం'లో ఆట ఆడించాడు. అయితే అందుతున్న సమాచరం మేరకు తెలుగులో మరిన్ని పీరియాడిక్ మూవీస్ తెరకేక్కుతున్నాయి. అందులో అగ్ర హీరోల నుండి కుర్ర హీరోలు అందరి సినిమాలు ఉన్నాయి. బాహుబలి ప్రభాస్ సాహో తర్వాత జిల్ ఫేం రాదా కృష్ణతో ఒక పీరియాడిక్ రొమాంటిక్ స్టోరీ చేస్తుండగా, నీదీనాడీ ఒకే కధ డైరెక్టర్ తో రానా కూడా ఒక పీరియాడిక్ స్టోరీ చేస్తున్నాడు. అలాగే జెర్సీ అంటూ నాని ఒక స్పోర్ట్స్ నేపధ్యం ఉన్న పీరియాడిక్ స్టోరీ చేస్తోంటే, నాగ చైతన్య - సమంతా జంటగా వస్తున్న మజిలీ కూడా దాదాపు ఆ కోవకు చెందినదే. ఇక మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ సినిమా కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో జరుగుతుండగా, అది కూడా దాదాపు పీరియాడిక్ మూడీ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక తాజాగా శర్వానంద్ 96 రీమేక్ ఒప్పుకోగా అందులోనూ సగం భాగం అప్పటి కాలంలోకి తీసుకెళ్లడం ఖాయం.  

More Related Stories