English   

మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది..

Mr-Majnu
2019-01-28 11:10:35

పాపం అఖిల్ కు మరో సినిమా షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది మిస్టర్ మజ్ను. ఈయన ప్రస్తుతం నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఊహించినంతగా వసూళ్లు రావడం లేదు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం మూడు రోజుల్లో కేవలం తొమ్మిది కోట్ల 60 లక్షల షేర్ మాత్రమే తీసుకొచ్చింది. ఈ సినిమా సేఫ్ కావాలి అంటే 24 కోట్లు రావాలి కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మాత్రం అంత ఈజీగా అనిపించడం లేదు. ఖచ్చితంగా ఈ చిత్రం కూడా అఖిల్ ఆశలు నిలబెట్టడంలో నిలువునా ముంచింది అని అర్థం అయిపోతుంది. రిలీజ్ కు ముందు భారీ ఎక్స్పెక్టేషన్స్ తోనే వచ్చింది మిస్టర్ మజ్ను. పైగా అఖిల్ కూడా ఈ సినిమాతో హిట్ కొడతాను చూసుకోండి అంటూ సవాల్ విసిరారు. కానీ విడుదల తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోయింది ఈ చిత్రం విజయం సాధించడం ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తోంది. 24 కోట్లలో కనీసం సగం వసూలు కూడా వీకెండ్ లో తీసుకురాలేకపోయింది. దాంతో నాలుగో రోజు నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనే భయంతో బతుకుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మిస్టర్ మజ్నుకు ఏది పెద్దగా కలిసి రావడం లేదు. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా ఏది లేకపోయినా కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 సినిమా ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. దాంతో మిస్టర్ మజ్ను ఈ సినిమాకు పోటీగా నిలబడలేకపోతుంది.

More Related Stories