English   

ఇస్మార్ట్ కోసం నిధి ఫైనల్ !

nidhi agarwal ram ismart shankar movie
2019-01-28 22:37:42

పూరీ జగన్నాథ్ - రామ్ క్రేజీ కాంబినేషన్ లో ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమా మొదలయ్యిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. అయితే టెక్నికల్ టీమ్ ని ముందే ప్రకటించిన పూరీ హీరోయిన్ ని మాత్రం ఫైనల్ చేయలేదు. ముందు అనూ ఇమ్మానుయెల్ అని వార్తలు రాగా, ఈరోజు ఉదయం, నిధి అగర్వాల్, నభా నటేష్ లని తీసుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే వాటిని నిజం చేస్తూ ఈ సినిమా కోసం సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్ ను రామ్ కు జోడీగా ఎంపిక చేశాడు పూరీ. ఈ విషయాన్ని ఛార్మీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇడియట్, లోఫర్, పోకిరి, టెంపర్ ఇలా టైటిళ్లతోనే తన హీరోలు ఎంత చెడ్డవారో అన్నట్టు క్రియేట్ చేసే పూరీ తన కొత్త చిత్రానికి మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్‌ పెట్టి దానికి డబుల్ దిమాక్ హైదరాబాదీ అనే ట్యాగ్ లైన్‌ తో ఈ సినిమాలో శంకర్ ఎలా ఉండబోతున్నాడో హింట్స్ ఇచ్చాడు పూరీ. దర్శకుడిగా పూరీకి, హీరోగా రామ్ పోతినేనికి ఈ సినిమా విజయం చాలా అవసరం, ఎందుకంటే టెంపర్ తర్వాత పూరికి, నేను శైలజ తర్వాత రామ్ కి చెప్పుకోవడనికి సరయిన హిట్స్ పడలేదు.

 

More Related Stories