English   

తల్లి కాబోతున్న యాంకర్ లాస్య !

is anchor lasya is pregnant
2019-01-28 16:11:31

బుల్లితెర యాంకర్ లాస్య తన సోల్ మేట్ మంజునాథ్ ని పెళ్లి చేసుకుని వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. 2017లో వారి వివాహం జరుగగా తాజాగా ఆమె తల్లి కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బుల్లితెర యాంకర్ లలో లాస్యది ప్రత్యేకమైన స్థానం, చీమ ఏనుగు జోక్స్ తో సంథింగ్ స్పెషల్ అంటూ కుర్రకారులో క్యూట్ యాంకర్ గా పేరుతెచ్చుకుంది. హాట్ యాంకర్స్ అయిన అనసూయ, రష్మీ లాంటివాళ్లతో అప్పట్లోనే పోటీని తట్టుకంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొంది. చురుకైన యాటిట్యూడ్ తో అలరించే లాస్య పెళ్ళయ్యాక బుల్లితెరపై కనిపించడం బాగా తగ్గింది. దీంతో ఆమె పెళ్ళైన మూడు నెలలకే అమ్మ అవుతోందని వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె ఖండించి ఇంకా రెండేళ్ళు సమయం ఉందని అప్పటి దాకా ఈ పిచ్చి రాతలు రాయద్దని కోరింది. పెళ్ళైన నాటి నుండి సోషల్ మీడియాతోనే ఆమె తన ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటోంది. లాస్యా టాక్స్ అంటూ ఒక కుకరీ యూట్యూబ్ చానల్ కూడా ఆమె మొదలుపెట్టింది. అయితే తాజాగా ఆమె తల్లి కాబోతున్నట్టు మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. మరి ఈసారి ఆమె ఏమంటుందో ? వేచి చూడలు మరి.

More Related Stories