English   

మణికర్ణిక దూకుడు మామూలుగా లేదుగా.. క్రిష్ సినిమా సంచలనాలు..

Manikarnika movie box office collections
2019-01-28 16:45:20

కంగనా రనౌత్ హీరోయిన్ గా ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మణికర్ణిక. గత వారం విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో 43 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు కేవలం 9 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు 18 కోట్లకు చేరుకుందిఎం ఇక మూడో రోజు కూడా 16 కోట్లు వసూలు చేసింది మణికర్ణిక. మూడు రోజుల్లో 43 కోట్లు వసూలు చేసి వంద కోట్ల వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం సులభమే అనిపిస్తుంది. థాకరే సినిమా విడుదలైన కూడా అది కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే చేరువవుతుంది. దాంతో ఇప్పుడు మణికర్ణిక వైపే ప్రేక్షకుల అడుగులు పడుతున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా తమ నమ్మకాన్ని నిలబెడుతుందని కంగనా రనౌత్ చెబుతోంది. అయితే మరో వైపు క్రిష్ మాత్రం ఈ సినిమాను తెరకెక్కించింది పూర్తిగా తానే అంటున్నాడు. సినిమా మొత్తం పూర్తయిన తర్వాతే తను బయటకి వచ్చానని.. కానీ కంగనారనౌత్ మాత్రం తాను ఏం చేయలేదు మొత్తం తానే చేసుకున్నాను అంటూ చెప్పుకుంటూ ఉందని విమర్శించాడు క్రిష్. కొన్ని రోజులు ఆమెను ఒంటరిగా వదిలేయాలని.. లేకపోతే ఇంకా మూర్ఖంగా మారిపోతుంది అంటున్నాడు ఈ దర్శకుడు. మొత్తానికి మణికర్ణిక సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు సాధిస్తుండడం తో కంగనా రనౌత్ పండగ చేసుకుంటుంది. అయితే ఈ క్రెడిట్ మాత్రం క్రిష్ కే రావాలి అంటున్నారు ఆయన అభిమానులు.

More Related Stories