English   

ఇది విన్నారా.. మంచు విష్ణు హాలీవుడ్ సినిమా చేస్తున్నాడంట..

Manchu Vishnu Goes Hollywood
2019-01-29 08:22:54

ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులుగా మంచి వారసులు. ఇద్దరు సినిమాలు చేయడం మానేశారు. మనోజ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటే. విష్ణు మాత్రం మంచి కథలు దొరకడం లేదని సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప ఇంకా లైన్ లోనే ఉంది. దీని గురించి ఎవరూ మాట్లాడక పోయేసరికి సినిమా ఆగిపోయిందేమో అనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అమెరికాలో జరుగుతున్నాయని తెలియజేశారు విష్ణు. దీన్ని ఒక హాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కథ నచ్చి ఆయనే తెరకెక్కిస్తాను అంటూ విష్ణును అడిగారు అని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై మంచు విష్ణు మాత్రం ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు. తనికెళ్ల భరణి భక్తకన్నప్ప సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మంచు విష్ణుకు హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని టాక్ తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీనిపై కూడా మంచి వారసుడు ఏమీ మాట్లాడటం లేదు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాడని తెలుస్తోంది. వచ్చిన తర్వాత భక్తకన్నప్పతో పాటు తన హాలీవుడ్ సినిమా ప్రాజెక్టు విషయాలు కూడా తెలియజేయనున్నారు విష్ణు. మొత్తానికి ముందు మంచు లక్ష్మీ వెళ్లి హాలీవుడ్ సీరియల్స్ లో నటించింది. ఇప్పుడు ఆమె తమ్ముడు కూడా హాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు.

More Related Stories