English   

ఆమెను ఒంటరిగా ఒదిలెయ్యండి...క్రిష్ కి కౌంటర్ !

rangoli chandel comments on director krish over manikarnika movie
2019-01-29 02:23:18

దర్శకుడు క్రిష్ మొదలుపెట్టి తప్పుకున్న ఝాన్సీ లక్ష్మీ భాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరేకేక్కిన్న మణికర్ణిక చిత్రం బంపర్ హిట్ అయ్యింది. ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ అయ్యాక పలు ఇంటర్వ్యూలలో క్రిష్ మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వీతీయ భాగంలో ఎక్కువ భాగాన్ని తానే తెరకెక్కించానని చెప్పారు. తొలి భాగంలో 20 నుంచి 25 శాతం వరకు కంగనా దర్శకత్వం వహించిందని రెండో భాగంలో కేవలం 10 శాతం మాత్రమే చిత్రీకరించిందని తెలిపారు. అలాగే సినిమా విడుదలయ్యే దాకా మౌనంగా ఉండదలచుకున్నానని, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించిన మొత్తం యూనిట్ కోసమే ఈ మౌనం దాల్చానని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే తాను దర్శకత్వం వహించిన చిత్రం బంగారమైతే కంగన దాన్ని వెండిగా మార్చిందని మాత్రం చెప్పగలను అంటూ క్రిష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా క్రిష్ చేసిన వ్యాఖ్యలపై ఆమె సోదరి రంగోలి చందేల్ స్పందించింది. ఈ చిత్రానికి మీరే దర్శకత్వం వహించారని ఒప్పుకుంటున్నానని, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండని ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కంగానాదే. ఆమెను ఒంటరిగా వదిలేయండి. ఈ చిత్ర విజయాన్ని ఆమెను ఎంజాయ్ చేయనివ్వండని ఆమె ట్వీట్ చేసింది. ఇక ఇంతటితో ఆపెయ్యండి. మేమంతా మిమల్ని నమ్ముతున్నాం అని ఆమె ట్వీట్ చేసింది.

More Related Stories