English   

వెంకటేష్ హాస్పిటల్ నుంచి వచ్చేది ఎప్పుడు..

When Daggubati Venkatesh is discharge from Hospital
2019-01-29 09:42:16

ఎఫ్ 2 విజయంతో జోరుమీదున్న వెంకటేష్.. ఇప్పుడు హాస్పిటల్ పాలైన సంగతి అభిమానులు షాక్ కు గురి చేస్తోంది. అసలు ఏమైంది.. ఎందుకు ఎందుకు ఆస్పత్రికి వెళ్లారు అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. అయితే ఇందులో భయపడాల్సిన పని కానీ.ఎం కంగారు పడాల్సిన పని కానీ అసలే లేదు. ఆయనకు చాలా రోజులుగా బ్యాక్ పెయిన్ ఉంది. ఈ వెన్నునొప్పి కారణంగానే విశాఖపట్నంలోని నేచర్ క్యూర్ హాస్పటల్ కు ఆయన రెగ్యులర్ గా వెళ్లి చెకప్ చేయించుకుంటారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్లారు. కాకపోతే ఈసారి కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ కావాలని వైద్యులు చెప్పడంతో సరే అన్నారు వెంకటేష్. దాంతో అక్కడే మూడు రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు విక్టరీ హీరో. హైదరాబాద్ వచ్చిన వెంటనే వెంకీ మామ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. జైలవకుశ లాంటి సినిమా తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకొని బాబి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికితోడు మేనమామ, మేనల్లుడు కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. అన్నింటికీ మించి వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు బాగా కలిసి వస్తున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్ 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే మ్యాజిక్ చేశాయి. ఒక్క మసాలా సినిమా మాత్రమే బోల్తా కొట్టింది. దాంతో ఇదే నమ్మకంతో ఇప్పుడు వెంకీ మామ కూడా సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు వెంకటేష్. ఆయన హాస్పిటల్ నుంచి రాగానే మొదలుపెట్టే తొలి పని ఇదే.

More Related Stories