లీకయిన మహర్షి....లైన్ అదేనా ?

భరత్ అనే నేను చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక కాస్త గ్యాప్ తీసుకుని మహేష్ నటిస్తున్న చిత్రం మహర్షి. మహేష్ కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ చిత్రంగా భావిస్తున్న ఈ 25వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇటీవల పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్ కోసం త్వరలో అబుదాబి వెళ్ళనుంది. అక్కడ కీలక సన్నివేశాలు తెరకెక్కించిన తర్వాత షూట్ కి ఓవరాల్ ప్యాకప్ చెప్పేయనున్నారు. తాజాగా జరిగిన షెడ్యూల్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పచ్చని పొలాల్లో మహేష్ మీడియాతో మాట్లాడుతున్నట్టుగా ఒక పిక్ ఉండగా, మరో పిక్‌లో మహేష్ అభిమానుల మధ్య నుండి వెళుతున్నట్టుగా ఉంది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ మీడియాతో మాట్లాడే సన్నివేశం హైలైట్ నిలిచింది. తాజాగా ‘మహర్షి’ చిత్రంలోనూ అలాంటి సన్నివేశమే ఉండబోతున్నట్టు లీకైన పిక్‌ని బట్టి భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త పద్దతులని అందించే పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.