English   

సింగరేణిలో విజయ్ షూటింగ్ !

Vijay-Devarakonda
2019-01-29 12:18:34

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తాజాగా కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ కి పిత్రు వియోగం కలగగా ఆయన షూట్ కి కాస్త గ్యాప్ ఇచ్చాడు. సో తన తర్వాతి సినిమా మొదలుపెట్టాడు విజయ్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రానున్న సినిమా షూట్ కోసం సోమవారం కొత్తగూడెంలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్‌లోని దన్‌బాద్‌ ప్రాంతానికి హీరో విజయ్‌ దేవరకొండ వచ్చారు. ఈ సంధ్రభంగా ఆయన మీద కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఖాకీ చొక్కా, ప్యాంట్‌ వేసుకున్న విజయ్‌ దేవరకొండ కార్మికునిగా షూటింగ్‌ పాల్గొన్నాడు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా ఐశ్వర్యారాజేష్‌, రాశీఖన్నా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క హీరోయిన్‌తోనే రొమాన్స్ చేస్తూ వచ్చిన విజయ్ ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు భామలతో ఆడిపాడనున్నాడు. మూడో హీరోయిన్ గా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోన్న బ్రెజిల్ మోడల్ ఇజబెల్లె హీరోయిన్లుగా నటించనున్నారు. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ వంటి మంచి చిత్రాలు తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.  

More Related Stories