English   

మహేష్ నుండి ఆ ముగ్గురు డైరెక్టర్స్ కి పిలుపు !

Mahesh-Babu
2019-01-29 07:59:21

మహేష్ మైల్ స్టోన్ 25వ మూవీగా మహర్షి సినిమా తెరకెక్కుతుంది. గత కొన్ని రోజులుగా పొల్లాచ్చి లో షూటింగ్ ను జరుగుతోంది. తాజాగా అక్కడ షూటింగ్ పూర్తి కావడంతో, మహర్షి టీమ్ హైదరాబాద్ కి చేరుకున్నట్టు సమాచారం. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే వారం నుంచి హైదరాబాద్ లో మొదలుకానుంది. అయితే షూటింగ్ కి వారం రోజుల సమయం ఉండటంతో,  మహేష్  బాబు నుంచి ముగ్గురు డైరెక్టర్లకు ఆహ్వానం అందినట్టు ఫిలింనగర్ లో జోరుగా గుసగుసలు ఆడుకుంటున్నారు. వారు ఎవరెవరు అంటే సుకుమార్, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా. అయితే ముందుగా  మహేష్  ను సుకుమార్ కలవనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే  మహేష్  బాబు తదుపరి సినిమా సుకుమార్ తో ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ ను సుకుమార్  మహేష్  బాబుకి వినిపిస్తాడని అంటున్నారు. ఆ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి,  మహేష్  బాబు కోసం సిద్ధం చేసిన కథను వినిపిస్తాడని ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా కూడా  మహేష్  బాబుకి స్క్రిప్ట్ వినిపించనున్నాడని చెబుతున్నారు. ఈ ఇద్దరు దర్శకులు  మహేష్  ను ఒప్పిస్తే సుకుమార్ తరువాత వాళ్ళ సినిమాలు ఉండనున్నాయి.  

More Related Stories