English   

ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ రిలీజ్ చేసిన వర్మ !

RGV
2019-01-29 10:16:12

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని లక్ష్మీ పార్వతి ఎంటరయిన సమయం నుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ రోజుకో చిత్రాన్ని విడుదల చేస్తున్న ఆయన, సినిమా మీద ఆస‌క్తిని కలిగించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే పాత్ర‌ల‌లో న‌టిస్తున్న న‌టుల వివ‌రాలు వెల్ల‌డించ‌కుండానే పోస్ట‌ర్‌లు రిలీజ్ చేస్తున్న వర్మ తాజాగా మ‌రో రెండు స్టిల్స్ రిలీజ్ చేశాడు. అందులో ఒకదానికి  ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఈ పాత్ర‌లు ఎవ‌రివి ? లక్ష్మీ పార్వతితో వారు ఎందుకు కలత చెందుతున్నారు? అనే కామెంట్ పెట్టగా, మరో చిత్రంలో ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఓ పాత్రధారి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో ఒక పిక్ లో ఉన్నది హ‌రికృష్ణ‌ అయితే రెండవ పిక్ లో హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో గోదావరి జిల్లాలకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు. ఇక చంద్రబాబుగా వంగవీటి సినిమాలో దేవినేని పాత్ర పోషించిన శ్రీ తేజ్ పోషిస్తుండగా ఈ సినిమాకి కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల ఎప్పుడో వర్మ ప్రకటించకపోవడంతో ఎన్నికల లోపే ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

More Related Stories