English   

ఆగిన సినిమా రాజ్ తరుణ్ తో మొదలయ్యిందా ?

Dil-Raju
2019-01-29 10:25:51

ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు పెద్దలు, ఇప్పుడు సినిమాలు కూడా ఓపెనింగ్ లు అయినా సరే ఎవరికీ ప్రాప్తం ఉందొ వారే రిలీజ్ చేస్తారేమో ? అదేంటి ఈ లాజిక్ అనుకుంటున్నారా ? ఈ మధ్య  నిర్మాత దిల్ రాజు ఓ సినిమాను మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు కోసం రెడీ చేశారు. గ్రాండ్ గా లాంచ్ కూడా అయ్యింది. కానీ ఏం జరిగిందో ఏమో, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది, అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో మొదలు కానుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ కి ఒక్క హిట్ కూడా పడలేదు. వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. దీంతో ఈ సినిమా రాజ్ తరుణ్ తో చేయిద్దామని ఫిక్స్ అయిన దిల్ రాజు పట్టాలెక్కించే పనిలో పడ్డారని అంటున్నారు. ముందు లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చిన రాజ్ తరుణ్ కి అన్నీ ఒకే లాంటి కధలు పడడంతో ఎంత త్వరగా లైం లైట్లోకి వచ్చాడో అంతే త్వరగా తెర వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో ఆయనకు దిల్ రాజ్ బ్యానర్ లో సినిమా అంటే పండగే. కానీ జయదేవ్ కొడుక్కో సరిపోని సబ్జెక్ట్ రాజ్ కి ఎలా సరిపోతుంది అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్. ఈ సినిమా దర్శకుడు కృష్ణారెడ్డి నుంచి 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా వచ్చింది. కమర్షియల్ హిట్ కాకపోయినా ఫర్వాలేదని టాక్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ ఫేట్ ఎలా మార్చనుందో ? చూడాలి మరి.

More Related Stories