English   

ఆ ఫోటోలు నావే.. ఇక వ‌దిలేయండంటున్న హ‌న్సిక‌.. 

Hansika
2019-01-29 10:36:26

సోషల్ మీడియాలో ఏవైనా ప్రవేట్ ఫోటోలు లీక్ అయినప్పుడు.. అవి తమవి కాదు అందులో ఉన్నది నేను కాదు అంటూ ఒక కామెంట్ చేస్తుంటారు ముద్దుగుమ్మలు. ఆ ఫోటోలో ఉన్నది వాళ్ళే అయినా కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ హన్సిక మాత్రం అలా కాదు. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో లీకయ్యాయి. తన పర్సనల్ ఫోన్ నుంచి ఎవరో హ్యాక్ చేసి ఈ ఫోటోలను పబ్లిక్ చేశారంటూ చెబుతోంది హన్సిక. దీనిపై సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి తన నీకు ఫోటోలపై మనసు విప్పి మాట్లాడింది హన్సిక. ఇందులో ఉన్నది తానేనని.. నాలుగేళ్ల కింద ఓ ఇన్నర్ వేర్ బ్రాండ్ కోసం ఫోటో షూట్ చేశారని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అది తన పర్సనల్ ఫోన్ లో ఉన్నాయని.. అయితే ఎవరో తనకు తెలియకుండా లీక్ చేశారు అంటూ వాపోయింది హన్సిక. ఇప్పటికీ తన ఫోన్ డేంజర్ లోనే ఉందని.. దయచేసి ఎవరు మెసేజ్ రిప్లై ఇవ్వలేదు అంటూ మరోసారి కోరింది హన్సిక. మొత్తానికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు తీరా జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత తీరిగ్గా బయటికి వచ్చి జరిగింది చెప్తే లాభం ఏముంటుంది..?

More Related Stories