English   

మ‌ణికర్ణిక కాంట్ర‌వ‌ర్సీ..క్రిష్ కు బాలీవుడ్ స‌పోర్ట్.. 

Manikarnika
2019-01-29 11:26:20

బాలీవుడ్ లో దర్శకుడు క్రిష్ చేస్తున్న ఉద్యమానికి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మణికర్ణికా సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓపెన్ గానే బయటికి వచ్చి చెప్పాడు క్రిష్. సినిమాను తాను తెరకెక్కిస్తే.. కంగనా రనౌత్ మొత్తం క్రెడిట్ తీసుకుందని చెబుతున్నాడు క్రిష్. ఈ విషయంలో ఆమెను ఏమీ అడగలేదు అంటున్నాడు ఈ దర్శకుడు. అడగ దలుచుకోలేదు కూడా అంటున్నాడు. ఆమె ఇష్టం అంటూ ఖరాఖండిగా చెప్పేసాడు క్రిష్. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు చేస్తున్న ఉద్యమంలో కొందరు బాలీవుడ్ సినిమా పెద్దలు ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక సినిమాను తెరకెక్కించినప్పుడు దాని ఫస్ట్ క్రెడిట్ రావాల్సింది దర్శకుడికే అని చెబుతోంది దర్శకురాలు పూజా భట్. ఈ విషయంలో తన ఫుల్ సపోర్ట్ క్రిష్ కే ఉంటుందని చెబుతోంది ఆమె. తాను బాలీవుడ్ ను చూడాలనుకున్న విధానం ఇది కాదని.. కంగనా రనౌత్ చేస్తున్నది తప్పు అంటూ ట్వీట్ చేసింది పూజా భట్. ఈమెతో పాటు ఇంకొందరు కూడా ఇప్పుడు క్రిష్ వెనకే ఉన్నారిప్పుడు. కంగనా రనౌత్ ఇలా చేస్తుందని అనుకోలేదంటున్నారు వాళ్లు. ఈ విషయంలో నిర్మాత కమల్ జైన్ కూడా క్రిష్ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు రోజురోజుకు మణికర్ణిక విషయంలో కంగనా రనౌత్ పై ఒక తెలియని యుద్ధం మొదలైపోయింది. ఇది చివరికి ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ సినిమా మూడు రోజుల్లో 45 కోట్లు వసూలు చేసి 100 కోట్లకు పరుగులు పెడుతోంది. మరి చివరికి మణికర్ణిక వివాదం ఎక్కడ ఆగుతుందో.. ఈ సినిమా తాలూకు క్రెడిట్ ఎవరు తీసుకుంటారో త్వరలోనే తేలనుంది.

More Related Stories