English   

మ‌హ‌ర్షి ప్రెస్ మీట్ అదిరిపోతుంద‌ట‌.. 

Maharshi
2019-01-29 18:58:07

మహర్షి సినిమాను చూస్తుంటే ఎందుకో తెలియకుండానే శ్రీమంతుడు సినిమా గుర్తుకు వస్తుంది. అందులో ఇందులో ఒకే కథ ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. నిజానికి ఈ రెండు సినిమాలు వేరు వేరు అయినా కూడా ఈ రెండింటిలోనూ మహేష్ బాబు శ్రీమంతుడుగా నటిస్తున్నాడు. ఊరు కోసం అన్నీ వదులుకొని వచ్చే పాత్రలో కనిపిస్తున్నాడు. శ్రీమంతుడులో ఇది ఆల్రెడీ చూసాం.. ఇప్పుడు మరోసారి ఇది చేయబోతున్నాడు సూపర్ స్టార్. తాజాగా మహర్షి సినిమాలోని ఒక సీన్ లీక్ అయ్యింది. ఇదే ఇప్పుడు సంచలనం అయిపోయింది. ఈ సీన్ లో పొలం గట్టున ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతున్నాడు మహేష్ బాబు. ప్రెస్ మీట్ సీన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది భరత్ అనే నేను సినిమా. అందులో ఆ ప్రెస్ మీట్ సీన్ సినిమాకు హైలైట్ అయింది. ఇప్పుడు మహర్షి సినిమాలో కూడా ఇలాంటి ఒక బలమైన ప్రెస్ మీట్ సీన్ ఒక‌టి ఉండబోతోందని తెలుస్తోంది. 

ఇప్పుడు దీనికి సంబంధించిన సీన్ లీక్ కావడంతో సినిమాలో ఇలాంటి సీన్ ఉందని కన్ఫర్మేష‌న్ కూడా వ‌చ్చేసింది. పూజా హెగ్డే ఈ సినిమాలో మహేష్ బాబుతో జోడీ కట్టింది. ఇప్ప‌టికే షూటింగ్ 80 శాతం పూర్తైపోయింది. ఫిబ్ర‌వ‌రి నాటికి టాకీ పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ తో బిజీ కానున్నారు చిత్ర‌యూనిట్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్నేహితుడి కోసమే ఆస్తులు అన్ని వదిలేసి అమెరికా నుంచి ఒక ఊరికి వచ్చి.. ఆ ఊరిని బాగు చేసే పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. ఆయన 25వ సినిమా కావడంతో వంశీ పైడిపల్లి కూడా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సందేశాత్మక కథతోనే ఈ చిత్రం రానుంది. ఏప్రిల్ 25న మహర్షి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి మహేష్ బాబు కోరుకుంటున్న ఆ విజయం మహర్షి సినిమాతో అందుకుంటాడో లేదో చూడాలి.

More Related Stories