English   

రామ్ చ‌ర‌ణ్ సురేంద‌ర్ రెడ్డి.. ఆల్ ఈజ్ నాట్ వెల్.. 

Ram-Charan
2019-01-29 20:14:40

ఏమో ఇప్పుడు ఇదే అనుమానాలు వ‌స్తున్నాయి. సైరా సినిమా విషయంలో అనుకున్నది అనుకున్నట్లు జరగడం లేదు. ఈ సినిమా విషయంలో ఏదో జరుగుతుంది. తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి.. నిర్మాత రామ్ చరణ్ మధ్యలో ఏదో వివాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ విషయంలో సురేందర్ రెడ్డికి రామ్ చ‌ర‌ణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇండస్ట్రీలో అయితే దీనిపై మాత్రం క్లారిటీ లేదు. సైరా షూటింగ్ మొదలు పెట్టి ఏడాది కావస్తున్నా కూడా ఇప్పటివరకు 60 శాతం మాత్రమే పూర్తయింది. పర్ఫెక్షన్ పేరుతో సురేందర్ రెడ్డి తీసిందే మళ్లీ మళ్లీ తీస్తున్నాడు అని రామ్ చరణ్ సీరియస్ అయ్యాడనే ప్రచారం జరుగుతుంది. దీనివల్ల బడ్జెట్ కూడా చేతులు దాటిపోతుంది. ఇది మెగా వారసుడు అసలు భయం. 150 కోట్లు అనుకున్న సైరా బ‌డ్జెట్ కాస్తా ఇప్పుడు రెండు 220 కోట్లకు చేరిందని తెలుస్తోంది. ఇంకా పెరిగితే అసలుకే మోసం వస్తుందని టెన్షన్ పడుతున్నాడు రామ్ చరణ్. ఈ విషయంలోనే చరణ్, సురేందర్ రెడ్డి మధ్య మాటపట్టింపులు వచ్చాయని తెలుస్తోంది. ఇప్పటి నుంచి సురేందర్ రెడ్డి కూడా షూటింగ్ లో వేగం పెంచాలని చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా దసరాకు విడుదల కావాల్సిందే అంటూ సురేందర్ రెడ్డికి రామ్ చరణ్ డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి దీనిపై దర్శకుడు ఏమంటాడో.. సినిమా అనుకున్న టైం కి తీసుకొస్తాడో లేదో చూడాలి.

More Related Stories