English   

షూట్ లో గాయపడ్డ నాని !

Nani
2019-01-29 20:28:57

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరయిన నేచురల్ స్టార్ నాని షూటింగ్‌లో గాయపడ్డారు. జెర్సీ సినిమా షూటింగ్‌లో భాగంగా నానికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో క్రికెటర్ అర్జున్‌ గా నాని కనిపించబోతున్నారు. క్రికెట్ నేపధ్యం ఉన్న ఈ సినిమాలో కీలకమైన సన్నివేశం తెరకెక్కిస్తున్న సందర్భంలో నాని ముక్కుకి షూట్ లో భాగంగా వచ్చిన క్రికెట్ బాల తగిలినట్టు తెలుస్తోంది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని గాయం చిన్నదే కావడంతో కాసేపు రెస్ట్ తీసుకుని నాని తిరిగి షూటింగ్‌ లో పాల్గొన్నట్టు సమాచారం. మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్ మీద హారికా హాసినీ చినబాబు కొడుకు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నాని సరసన కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తు ఈ సినిమాతో టాలీవుడ ఎంట్రీ ఇస్తూన్నారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Related Stories