English   

దూసుకొస్తున్న మెగా వారసుడు.. అకీరా ఎలా ఉన్నాడో తెలుసా..

pawan kalyan son akira nandan pics goes viral
2019-01-29 23:08:11

అకీరా నందన్.. మెగా అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. పవన్ కళ్యాణ్ నట వారసుడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న అకిరా నందన్.. అమ్మ దగ్గరే పెరుగుతున్నాడు. ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్న అకీరా నందన్ ఫోటోలు చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరో రెండు మూడేళ్లలోనే మెగా కుటుంబంలో మరో హీరో వస్తున్నాడంటూ సంబరాలు చేసుకున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్న ఈ సమయంలో ఆయన వారసుడు ఫోటోలు చూసి.. అఖీరా త్వరలోనే హీరో కావడం ఖాయం అంటూ ఆనందంలో మునిగిపోతున్నారు. తాజాగా ఆయన హెడ్సెట్ పెట్టుకొని పాటలు వింటూ స్టైల్ గా ఉన్న ఒక లుక్ విడుదలైంది. ఇది చూసి నిజంగానే మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంత త్వరగా అకిరా నందన్ ఇంతగా ఎదిగిపోయాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. హైట్ లో వరుణ్ తేజ్ ను అందుకుంటున్నాడు అకీరా నందన్. అయితే అకిరా తల్లి.. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం తనకు ఏది ఇష్టమైతే అదే చేస్తాడు.. బలవంతంగా నటన వైపు మాత్రం వెళ్ళనివ్వను అంటోంది. అకిరా నందన్ కూడా తనకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను అంటున్నాడు. మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారసుడు ఎంట్రీ కోసం అభిమానులు ఇప్పటినుంచే వెయిట్ చేస్తున్నారు.

More Related Stories