English   

భరించలేనంత బరువు పెరిగిపోయిన ఇలియానా..

Ileana D'Cruz put focus on personal life
2019-01-29 23:21:36

ఇలియానా అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది నడుము.. ఆ మడతలో పడి ఎంతో మంది కుర్రాళ్లు చచ్చిపోయారు. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని దుమ్ము దులిపేసింది ఇలియానా. ఈ గోవా బ్యూటీ ఒంపులకు పడిపోయిన వారు లేరు. అంతగా మాయ చేసిన ఇలియానా ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది. బాలీవుడ్లో అవకాశం వచ్చిందని తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూసింది. ఆరేళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ గత ఏడాది అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించిన కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఫిజిక్ లో కూడా చాలా తేడాలు వచ్చాయి. ఇప్పుడు ఇలియానాను చూస్తుంటే అసలు ఒకప్పుడు మనం చూసిన గోవా బ్యూటీ ఈమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. అంతగా బరువు పెరిగిపోయి చూడటానికి కూడా ఎబ్బెట్టుగా మారిపోయింది ఇలియానా. ముందు నుంచి ఇలియానాకు గుర్తింపు తీసుకొచ్చిన నడుము.. ఇప్పుడు మరీ దారుణంగా మారిపోయింది. ఆమెను ప్రస్తుత ఫోటోలు చూస్తుంటే వామ్మో ఏంటి సైజు అని భయపడక తప్పదు. ప్రస్తుతానికి సినిమాలపై పూర్తిగా దృష్టి తగ్గించి పర్సనల్ లైఫ్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది ఇలియానా. ఈమె తీరు చూస్తుంటే ఇక తెలుగు సినిమాలకు కూడా గుడ్ బై చెప్పినట్లు అర్థమైపోతుంది.

More Related Stories