English   

త్రివిక్రమ్ మరోసారి సన్నాఫ్ సత్యమూర్తి చేస్తున్నాడా...

Trivikram
2019-01-30 04:48:16

ఈ అనుమానాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. దాదాపు ఆరు నెలలు గ్యాప్ తీసుకొని బన్నీ ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. ఇందులో ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కేవలం ఎనిమిది నెలల్లో సినిమా షూటింగ్ పూర్తిచేసి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. అరవింద సమేత సినిమా కూడా దసరా సీజన్ లోనే వచ్చి మంచి వసూళ్లు సాదించడంతో.. ఇప్పుడు బన్నీ సినిమాను కూడా అదే సీజన్లో విడుదల చేయాలని చూస్తున్నాడు. అయితే ఆ సమయంలో చిరంజీవి సైరా సినిమా కూడా రావాలని చూస్తుంది. ఒకవేళ చిరంజీవి వస్తే బన్నీ సైలెంట్ గా సైడ్ ఇవ్వడం తప్ప మరో ఆప్షన్ లేదు. ప్రస్తుతానికి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రం పూర్తిగా ఫాదర్ సెంటిమెంట్ తో రాబోతుందని తెలుస్తోంది. విచిత్రంగా బన్నీతో త్రివిక్రమ్ చేసిన గత సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా పూర్తిగా తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒక రకంగా అరవింద సమేత సినిమా కూడా తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలోనే సాగింది. తన ప్రతి సినిమాలో కూడా తండ్రి పాత్రకు అంతగా గౌరవిస్తాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సారి కూడా అదే చేయబోతున్నాడు. నా పేరు సూర్య ప్లాప్ తర్వాత బన్ని చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా గురించి భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మరి వాళ్ళను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందుకుంటాడో లేదో చూడాలి.
 

More Related Stories