English   

నానా పటేకర్ ఇంట తీవ్ర విషాదం !

Nana Patekar
2019-01-30 05:39:38

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ ఇంట తీవ్ర విషాదం చితు చేసుకుంది. ఆయన తల్లి నిర్మ‌లా ప‌టేక‌ర్ ఈ  సోమ‌వారం నాడు మృతి చెందారు. ఆమె అంత్య‌క్రియ‌లు నిన్న సాయంత్రం నిర్వ‌హించారు. నిర్మ‌లా పటేకర్ వయసు ప్రస్తుతం 99 సంవత్సరాలు, కొద్ది సంవ‌త్స‌రాలుగా ముంబైలో ఆమె కొడుకు నానా పటేకర్ తోనే క‌లిసి ఉంటున్నారు. అయితే త‌ల్లిని ఎంతో ప్రేమ‌గా చూసుకునే నానా ప‌టేక‌ర్‌కి ఆమె మ‌ర‌ణం దిగ్భ్రాంతిని క‌లిగించిందమే చెప్పాలి, ఎందుకంటే తాను ప్రాణంలా చూసుకునే తల్లి చ‌నిపోయిన స‌మ‌యంలో నానా ప‌టేక‌ర్ ఇంట్లో లేర‌ట‌. విష‌యం తెలుసుకున్న నానా వెంట‌నే ఇంటికి చేరుకున్నారని తెలుస్తోంది. నిన్న జరిగిన అంత్యక్రియల్లో మ‌ల్హ‌ర్ ప‌టేక‌ర్, స‌న్నిహితులు కుటుంబ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు. నానా ప‌టేక‌ర్ త‌న 28 ఏళ్ళ వ‌య‌స్సులోనే తండ్రిని  కోల్పోయారు అప్పటి నుండి ఆయన తన తల్లిని ప్రాణంగా చూసుకుంటూ వచ్చారు. ఇదే విషయాన్ని ఆయన ప‌లు ఇంట‌రవ్యూల‌లోను త‌న త‌ల్లితో ఉన్న అనుబంధాన్ని ప్ర‌స్తావించారు.  

More Related Stories