English   

ర‌వితేజ‌ సమంత ఇద్ద‌రూ ఒకే క‌థ చేస్తున్నారా..? 

Ravi-Teja-Samantha
2019-01-30 12:52:35

రవితేజను అక్కినేని కోడలు ఫాలో అవుతుంది.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఒక్కోసారి మనకు తెలియకుండానే రెండు సినిమాలు ఒకే కథతో వస్తుంటాయి. గతంలో కూడా ఇదే జరిగింది.. ఇప్పుడు కూడా ఇది జరగబోతుంది. రవితేజ, సమంత సినిమాలు ఒకే నేపథ్యమున్న కథలతో తెరకెక్కుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై వాళ్లకు కూడా క్లారిటీ ఉందో లేదో తెలియదు. రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి అయిపోయింది. వరుస డిజాస్టర్ లతో ఉన్న రవితేజకు డిస్కో రాజా ఫలితం కీలకంగా మారింది. తనకు ప్రయోగాలు కలిసి రావని తెలిసినా కూడా ఆనంద్ పై నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నాడు రవితేజ. ఇందులో ముసలి తనం నుంచి యవ్వనంలోకి వచ్చే పాత్రలో నటిస్తున్నాడు రవితేజ. 

అది ఎలా జరుగుతుంది అనేది సినిమాలో చూడాలి. ఒక చిన్న ప్రయోగం వయసు ఎలా మార్చేసింది అనే కథతో డిస్కో రాజా సినిమాను  తెరకెక్కిస్తున్నాడు ఆనంద్. ఇదిలా ఉంటే సమంత త్వరలో నటించబోయే మిస్ గ్రానీ సినిమా కూడా ఇలాగే ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో కూడా 70 ఏళ్ల బామ్మ పాతికేళ్ల భామగా ఎలా మారిపోతుంది అనేది కథ. కొరియన్ సినిమాకు రీమేక్ ఇది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు నందినీరెడ్డి ఈ చిత్ర కథను మార్చింది. రవితేజ, సమంత సినిమాలు రెండూ వయసు చుట్టూనే తిరుగుతున్నాయి. అదికూడా ఒక ప్రయోగం వల్ల.. మరి ఈ రెండు సినిమాల కథలు వేరు వేరుగా ఉన్న కూడా నేపథ్యం అయితే ఒకటే. రేపు విడుదలయిన తర్వాత ఏది ఎలా ఉండబోతుందో.. ప్రేక్షకులను ఏ సినిమా ఎంతగా అలరించబోతుంద‌నేది తెలుస్తోంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు.

More Related Stories