English   

ప్రియా వారియర్ తెలుగు ఇండస్ట్రీకి రావడం కన్ఫర్మ్ అయిపోయిందా..

Priya-Prakash-Varrier
2019-01-30 07:27:23

ఏమో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ త్వరలోనే తెలుగు ఇండస్ట్రీకి వస్తుందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ భామ కోసం మన హీరోలు బాగానే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా త్రివిక్రమ-అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ప్రియా వారియర్ ని తీసుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. దీనికోసమే స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రియా వారియర్ కూడా తనకు బన్నీతో నటించే అవకాశం వస్తే వదులుకోనని చెప్పింది. గతంలో ఒకసారి వచ్చినందుకు అనుకోకుండా మిస్ చేసుకున్నానని.. ఈసారి మాత్రం చేయను అంటోంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు నాని సినిమాలో కూడా ప్రియ వారియర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ కె.కుమార్ దీనికి దర్శకుడు. ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా కోసం కూడా స్క్రీన్ టెస్ట్ ప్రియా వారియర్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలతో ప్రియా వారియర్ తెలుగు ఇండస్ట్రీలో పాగా వేయబోతుందని ప్రచారం జరుగుతోంది. వీళ్లతో పాటు అవకాశం వస్తే ప్రియా వారియర్ తో నటించడానికి మన హీరోల్లో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి ఈ వింక్ గర్ల్ తెలుగు ఇండస్ట్రీపై సీరియస్ గా కన్నేసింది..

More Related Stories