English   

హీరోయిన్ అవుతున్న విలన్ కూతురు !

Riva
2019-01-30 15:59:04

రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా కనిపించి తెలుగులో యాక్టర్ గా నిరూపించుకున్నాడు బోజ్‌పురి హీరో రవికిషన్. ఆ తర్వాత వరుసగా కిక్ 2, లై, ఎమ్మెల్యేతో పాటు ప‌లు సినిమాల‌లో విలన్ పాత్రల్లో క‌నిపించాడు, కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయ‌న కుమార్తె రివా బాలీవుడ్ తెర‌కి ప‌రిచ‌యం కాబోతుంది. క‌ర‌ణ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో ‘సబ్‌ కుశల్‌ మంగళ్‌’ అనే టైటిల్‌తో ఓ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా ఇందులో రివా క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఇదే సినిమాతో ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి‌ కుమారుడు ప్రియాంక్ హీరోగా బాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. అక్ష‌య్ ఖ‌న్నా ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ సినిమాని నితిన్ మ‌న్మోహ‌న్ కుమార్తె ప్రాచి నిర్మిస్తున్నారు. రెండు నెల‌లుగా రివా, ప్రియాంక్‌ల‌కి ప‌లు వ‌ర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నామని ప్రాచి తెలిపారు. అయితే ఈమె సినిమాల్లోకి రావడం ఇప్పుడే అయినా వార్తల్లోకి ఎప్పుడో ఎక్కారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం రవి కిషన్ తన కూతురు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పుడు తన 19 సంవత్సరాల కూతురు కనిపించడం లేదంటూ భానునగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆయన తన కూతురు కనిపించకుండాపోవడం ఇది రెండో సారి అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Related Stories