English   

వాల్మీకి...అప్పుడే వివాదాలా ? 

Varun-Tej
2019-01-30 09:36:19

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. తమిళ చిత్రం జిగర్తాండకు ఈ సినిమా. పేట ఫేం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో వాల్మీకి పేరుతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు. అయితే తాజాగా వాల్మీకి టైటిల్ వివాదంలో చిక్కుకుంది. జిగర్తాండ ఒక గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని, అలాంటి కథకు తెలుగులో వాల్మీకి అనే పేరును ఎలా పెడతారంటూ వాల్మీకి సామాజికవర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆ పేరును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాల్మీకి దొంగ కాదని హర్యానా హైకోర్టు కూడా తీర్పునిచ్చిందని, అలాంటిది ఆయన్ని ఒక దొంగగా పరిగణిస్తూ ఆయన పేరును గ్యాంగ్‌ స్టర్ నేపధ్యం ఉన్న సినిమాకు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. వాల్మీకి లోగోపైనే గన్ పెట్టడం పెద్ద తప్పని అంటున్నారు. అయితే ఈ వివాదం కత్తి మహేశ్ స్పందించారు. ఓ టీవీ చానెల్ నిర్వహించిన డిబేట్‌ లో బోయ సంఘాల నేతలతో పాటు కత్తి మహేశ్ పాల్గొని వాల్మీకి టైటిల్‌ను సమర్థిస్తూ కత్తి మహేశ్ మాట్లాడారు. వాల్మీకి బోయవాడుగా, రామాయణాన్ని రచించిన మహాకవిగా అందరికీ తెలుసని ఆయన పేరుతోనే వాల్మీకి కులం పుట్టిందని అన్నారు. ‘జిగర్తాండ’ సినిమాను తమిళంలో తాను చూశానని, ఒక గ్యాంగ్‌స్టర్ సినిమాలపై మక్కువతో సినీ రచయితగా మారిపోతాడాని చెప్పారు. అతను గ్యాంగ్‌స్టర్ నుంచి రచయితగా మారాడు కాబట్టే వాల్మీకి టైటిల్‌ను హరీష్ శంకర్ పెట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథం కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఆ సినిమాలోని ఒక పాట తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని బ్రాహ్మణ సామాజికవర్గం అప్పట్లో అభ్యంతరం తెలిపింది. అది ఎలాగో సద్దు మణిగినా ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి. 
 

More Related Stories