English   

వెంకీ మామా ముహూర్తం కుదిరింది !

Venky-Mama
2019-01-30 16:57:49

విక్ట‌రీ వెంక‌టేష్ ఇటీవ‌ల ఎఫ్ 2 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగతి తెసిలిందే. ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంది. ఇక త‌న మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ అనే మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్నాడు. గ‌త ఏడాది ఈ చిత్రం అఫీషియ‌ల్ లాంచ్ కాగా, కొన్ని కార‌ణాల వ‌ల‌న మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళ‌లేదు. ఫిబ్ర‌వ‌రి 21 నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌నేది తాజా అప్డేట్, జై లవకుశ ఫేం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ మ‌ల్టీ స్టార‌ర్‌లో నాగచైతన్య సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించనునుండగా, వెంకటేశ్‌కు జోడీగా శ్రియ లేదా హ్యూమా ఖురేషీ న‌టించ‌నున్నార‌ని సమాచారం. వెంకీ హోమ్ బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు పాపుల‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేష‌న్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమా తెరకేక్కిన్చానున్నాయి. వెంకటేష్ 74వ చిత్రంగా 'వెంకీ మామ' రూపొందబోతుంది.  నిజజీవితంలో కూడా నాగచైతన్యకు వెంకీ మేనమామ అవుతాడు అని తెలిసిన విషయమే. ఇంతకుముందు చై నటించిన 'ప్రేమమ్' సినిమాలో వెంకీ ఒక కామియో ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్లీ మేనల్లుడు తో కలిసి ఫుల్-లెంగ్త్ పాత్రలో మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు.  

More Related Stories