English   

వైఎస్ యాత్రలో సన్నీ లియోన్ ! 

Sunny-Leone
2019-01-30 10:52:01

ఆంధ్రప్రదేశ్ దిగవంత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని దర్శకుడు మహీ వి రాఘవ్ ‘యాత్ర’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. అయితే అచ్చం వైఎస్ వేషధారణలో ఉన్న మమ్ముట్టి పక్కన శృంగార తార సన్నీ లియోన్ ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ‘యాత్ర’ సినిమాలో సన్నీ నటిస్తోందంటూ  వార్తలు నిన్నటి నుండి హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో డ్యామేజ్ జరుగుతుందేమో అనుకున్న మేకర్స్ స్పందించారు. మమ్ముట్టి సొంత భాషలో నటిస్తున్న మధురరాజాకి సంబంధించిన లొకేషన్ స్టిల్ అని,  ఆ సినిమాలో సన్నిలియోన్ కూడా నటిస్తోందని వారు క్లారిటీ ఇచ్చారు. కొందరు వ్యక్తులు ఈ ఫొటో యాత్ర సినిమాలోనిది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, వాటిని పట్టించుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. గతంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన పొక్కిరి రాజా సినిమాకు మధుర రాజా సీక్వెల్ గా రూపొందుతోంది. సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ ని రూపొందిస్తున్నారు. అందులో సన్నితో మమ్ముట్టి స్టెప్ వేయనున్నారు. ఆ పిక్ ఇప్పుడు యాత్ర సినిమాలోది అంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు.

More Related Stories