టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న ఖలీ !

‘ప్రేమించుకుందాం రా’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ లాంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు జయంత్ సి పరాన్జీ ప్రస్తుతం మంచి హిట్ ఒక్కటీ లేక అందు కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన నరేంద్ర అనే టైటిల్‌తో మూవీ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంతో భారత దేశానికీ చెందిన ప్రముఖ రెజ్లర్ దలీప్ సింగ్ రాణా(ది గ్రేట్ ఖలీ) టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో నీలేష్ హీరోగా నటించనుండగా, ఆయన సరసన మిస్టర్ మజ్ను సినిమాలో నటించిన బ్రెజిలియన్ మోడల్, నటి ఇసబెల్ లీత్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. రామ్ సంపత్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఖలీ కీలక పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిగా ఏపీ మినిస్టర్ కొడుకు గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ జయదేవ్ అనే సినిమాని చేశారు, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యి ఎప్పుడు వెల్లిపోయిందో కూడా తెలియకపోవడంతో జయంత్ సి పరాన్జీ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు