English   

ట్వీట్ల నుండి వాట్సాప్ చాట్ల దాకా వెళ్ళిన మణికర్ణిక వివాదం !

manikarnika kangana ranauts sister tweets her whatsapp chat with krish says actor is disturbed by conspiracies
2019-01-30 21:18:58

'మణికర్ణిక' వివాదంలో దర్శకుడు క్రిష్ మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో పాటు కంగనా బిహేవియర్ గురించి బయటపెట్టడంతో కంగనా రనౌత్ మీద విమర్శల వర్షం కురుస్తోంది. దీంతో ఆమె డైరెక్ట్ గా రంగంలోకి దిగకుండా ఆమె సోదరి రంగోళీని దింపింది. అయితే క్రిష్ చేసిన ప్రకటన విన్న తర్వాత చాలా మంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. 70 శాతం సినిమా చిత్రీకరించిన ఆయనకు తగిన గుర్తింపు చిత్ర బృందం ఇవ్వలేదని, కేవలం 30 శాతం రీషూట్ చేసి సినిమా మొత్తం తానే చేసినట్లుగా కంగనా చెప్పుకోవడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి బాలీవుడ్ నుండి కూడా క్రిష్ కే మద్దతు లభిస్తోంది. తాజాగా ఆ సినిమాకి ముందు పనిచేసిన ఎడిటర్ చేసిన వాట్సాప్ మెసేజ్ లని క్రిష్ ట్వీట్ చేయడంతో కంగనా సోదరి కూడా ట్వీట్ చేసింది. క్రిష్ చేస్తున్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ డిసెంబర్ 6వ తేదీన సినిమా చూడాలని కంగనా క్లియర్‌గా క్రిష్‌ను అడిగిందని దానికి ఈ వాట్సాప్ చాట్ సాక్ష్యమని అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ ఆమె షేర్ చేశారు. అలాగే ఆమె మరో ట్వీట్లో కంగనా, విజయేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ బయట పెట్టింది. అక్టోబర్ 4న రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు పంపిన సందేశంలో క్రిష్ గురించి మాట్లాడిందని, ఆయన పిరికిపందలా దాక్కోకుండా తన స్థానే కంగనాని షూట్ చేయమని చెప్పానని ఒక స్టేట్మెంట్ ఇప్పించమని అడిగినట్టు ఉంది. అతడిని సినిమాలో భాగం కావాలని కోరినట్లు ఆమె ట్వీట్ చేసింది. అయితే ఈ విషయం మీద క్రిష్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.

More Related Stories