English   

పూరీని మబ్బులా కమ్మేసిన చార్మీ !

puri-Charmee
2019-01-31 04:33:44

ఇండస్ట్రీలో పూరీ - చార్మీ ల మీద చాలా కాలం నుండి రకరకాల రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయినా వాటిని వాళ్లిద్దరూ పట్టించుకోకుండా ఎవరిపని వారు చేసుకుంటున్నారు. ఒకరకంగా హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిపోయిన ఛార్మీతో పూరీ కలిసే వ్యాపారం చేస్తున్నారు. పూరీ కనెక్ట్, పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్‌ల మీద పూరీ సినిమాలు తీస్తుంటే ప్రొడక్షన్ అంతా దగ్గరుండి మరీ చూసుకుంటోంది ఛార్మి. 

తాజాగా పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలపై పూరి రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ఓపెనింగ్ రోజున క్లాప్ కొట్టేసింది చార్మీ. ఆ మధ్య పూరీ భార్య వీరిద్దరి వ్యవహారంతో విసిగిపోయారని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పూరి, చార్మి రిలేషన్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ సంచలన విషయం బయటపెట్టారు. ఓ యూట్యూబ్ ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. 

పూరీ జగన్నాథ్‌ తో తనకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందని అయితే ఆయన పక్కనే ఉండే చార్మీతో మాత్రం ఎలాంటి రిలేషన్ లేదని అన్నారు. జగన్(పూరీ) అనే వాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నాడని ఆ మబ్బుల్లో సూర్యుడు మబ్బులు తొలగిపోగానే ఖచ్చితంగా బయటకు వస్తాడని, ఆ మబ్బు చార్మినే అయి ఉండొచ్చు అంటూ పరోక్షంగా కామెంట్ చేసింది. అయినా నిప్పు లేకుండా పొగ రాదంటారు, అలాగే తెలియకుండా ఒకరి గురించి ఇలా అనుకోవడం కూడా భావ్యం కాదు, ఏమయినా లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.  

More Related Stories