English   

మరో సినిమా లైన్ లో పెట్టేసిన సూర్య ! 

Suriya-38
2019-01-31 05:10:18

తెలుగు, త‌మిళంలో మంచి క్రేజ్ అందునా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న సూర్య‌ ప్ర‌స్తుతం ఎన్‌జీకే సినిమాతో పాటు క‌ప్పన్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. సెల్వ‌ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఎన్‌జీకే చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్యాకప్ చెప్పగా, ప్ర‌స్తుతం డబ్బింగ్ రీమిక్సింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. వీలయినంత త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ ని ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయనున్నారు. మరోపక్క ఆర్య‌, మోహ‌న్‌ లాల్‌, సూర్య ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న క‌ప్పన్ చిత్రం కూడా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇందులో సూర్య ప్రధాని పాత్రధారి మోహన్ లాల్ కి సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటె సూర్య తర్వాతి సినిమాకి కూడా ముహూర్తం ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఇరుది సుట్రై ఫేం సుధా కె ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య త‌న తదుపరి అంటే 38వ చిత్రాన్ని ఒప్పుకున్నాడని, ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రిలో సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్నార‌ని తమిళ మీడియా సమాచారం. జీవీ ప్ర‌కాశ్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. త్వ‌ర‌లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

More Related Stories