English   

ఆర్య వెడ్స్ సాయేశా ముహూర్తం ఫిక్సయ్యింది !

Arya-Sayyeshaa
2019-01-31 13:33:59

తమిళ హీరో ఆర్య, నటి సాయేషా సైగల్‌ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరు ఒకర్నొకరు ఇష్టపడుతున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే తమ ప్రేమ, వివాహం గురించి అనేక వార్తలు పుట్టుకొస్తున్నా ఆర్య, సాయేషా మాత్రం స్పందించలేదు. అయితే వీరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. ఈ ఏడాది మార్చ్ 9, 10 లలో వారి వివాహం హైదరాబాద్ లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత చెన్నై లో కోలీవుడ్ ప్రముఖుల కోసం ఒక రిసెప్షన్ కూడా ఉంటుందట. ఆర్య, సాయేషా కలిసి తొలిసారి ‘గజినీకాంత్‌’ సినిమా కోసం పనిచేశారు. గత ఏడాది ఆగస్టులో తమిళంలో విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదని పించుకుంది. ఈ సినిమా అప్పుడే వీరి మధ్య స్నేహం ఏర్పడిందని, తర్వాత ప్రేమగా మారిందని అంటున్నారు. ఇప్పుడు ఆర్య, సాయేషా కలిసి దర్శకుడు సూర్య, మోహన్ లాల్ లతో కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న‌ ‘కాప్పాన్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్‌లో సాయేషా తల్లి షహీన్‌ భాను ఆర్యను స్పెషల్ గా చూసుకుంటున్నారట. ఆయనతో ఎంతో ఆప్యాయంగా మెలుగుతున్నారని టాక్‌. ముంబయిలో పుట్టి పెరిగిన సాయేషా అఖిల్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మరో విషయం ఏంటంటే ఆర్య కంటే సాయేషా వయసులో 17 ఏళ్లు చిన్నది.

More Related Stories