English   

డబుల్ రేట్ పెట్టి ఫ్లాట్ కొన్న అలియా...అదే రీజన్ !

Alia-Bhatt
2019-01-31 07:17:56

బీ టవున్ స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలో అడిగిపెట్టిన ఆలియా భట్ తండ్రి ఇమేజ్ తో పని లేకుండా తనకంటూ ఓ సొంత ఇమేజ్‌ ని సొంతం చేసుకుంది. బీ టవున్ ఆదరించే గ్లామరస్ రోల్స్‌ ఒక్కటే కాక ఉడ్తా పంజాబ్‌ లాంటి సినిమాలో పూర్తి డీగ్లామరస్ రోల్‌ లోనూ అదరగొట్టింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన ఒకరిగా మారిపోయింది. దీంతో ఎక్కడికక్కడ ప్రాపర్టీలను కొనే పనిలో ఉంది. అయితే రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ అమ్మడు తమ ప్రేమ బంధాన్ని మరింత బలపరుచుకుంతోంది. అందుకే ఆమె డబుల్ రేట్ పెట్టి మరీ రణబీర్ కపూర్ పక్క ఫ్లాట్ కొనింది. అలియా భట్ కొనుగోలు చేసిన ఇల్లు ఖరీదు వాస్తవానికి రూ. 7.8 కోట్లు మాత్రమేనంట. అయితే ఆమె ఇందుకోసం రూ. 13 కోట్లు ఖర్చు పెట్టడం తో ఈ విషయం వార్తల్లోకి ఎక్కింది. ముంబైలోని జుహులో ఇప్పటికే రెండు ఫ్లాట్లను కొన్న ఆలియా తాజాగా మరో 2300 చదరపు అడుగులు ఉన్న అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది.  2015లో ఇదే బిల్డింగ్‌లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నుంచి రూ.5 కోట్లు, రూ.3.83 కోట్లు పెట్టి రెండు ఫ్లాట్ లని ఆలియా కొన్నది. ప్రస్తుతం ఇందులోనే ఒక దాంట్లో తన అక్క‌ షహీన్ భట్‌ తో కలిసి ఆమె ఉంటోంది.

More Related Stories