English   

మహేష్ తో కత్రినా క్లారిటీ ఇచ్చేసింది !

Katrina-Kaif
2019-01-31 18:06:29

ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్న‌ మ‌హేష్ త్వ‌ర‌లో సుకుమార్‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్ ను ఫైనల్‌ చేశారన్న టాక్‌ గట్టిగానే వినిపించింది.

 తాజాగా ఈ టాక్ మీద క్లారిటీ ఇచ్చింది క‌త్రినా. ప్ర‌స్తుతం స‌ల్మాన్ స‌ర‌స‌న భార‌త్ అనే చిత్రంలో న‌టిస్తున్న క‌త్రినా త‌న త‌దుప‌రి చిత్రం ఏంట‌నేది ఇంకా ఓకే కాలేద‌ని తెలిపింది. మ‌హేష్ సినిమాకి సంబంధించిన చిత్ర యూనిట్ ఎవరూ తనని సంప్ర‌దించ‌లేదని, మ‌హేష్ 26వ సినిమాలో న‌టిస్తున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదని క‌త్రినా మీడియాతో తెలిపింది. 

దీంతో మహేష్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో కత్రినా హీరోయిన్‌ అన్న రూమర్స్‌కు తెరపడినట్లు అయ్యింది.  కత్రినా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి , అల్లరి పిడుగు చిత్రాల్లో నటించింది. అయితే వెంకటేష్ మల్లీశ్వరి మాత్రమే హిట్ అయ్యింది. ఇక వాటి తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు ఇప్పుడు మహేష్ తో ఉంటుందనుకుంటే అది పుకారు అని అని తేలింది.

More Related Stories