English   

మరో సారి నాని - మారుతీ కాంబో !

Nani
2019-01-31 19:18:27

నాని- మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కామెడీ ఎంట‌ర్‌టైనర్ భ‌లే భలే మ‌గాడివోయ్. 2014 లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక నానికి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. అలాంటి విజయాన్ని అందించిన మారుతి దర్శకత్వంలో మరోసారి నాని నటించనున్నాడని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని కూడా సమాచారం. ప్ర‌స్తుతం నాని మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్షన్ లో జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు. క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు నాని. ఈ సినిమాతో పాటుగా మారుతి సినిమా కూడా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. గతంలో మతిమరుపు కాన్సెప్ట్ తో అలరించిన నని - మారుతీ ఈ సారి ఎటువంటి కాన్సెప్ట్ తో రానున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories