English   

పూరీ రెండో హీరోయిన్ ఫైనల్ అయ్యింది !

Nabha-Natesh
2019-01-31 12:45:56

నభా నటేశ్‌  టాలీవుడ్ కి సుదీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయం అయింది. తన నటనతో అందరి చూపు తనవైపు తిపుకుంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయం సాధించి ఆమె ఉత్తమ నటిగా  జీసినీ అవార్డులకు కూడా నభానటేశ్‌  ఎంపిక అయింది. అయితే ఆ తర్వాత రవిబాబు అదుగో అంటూ పందిపిల్ల సినిమాతో మన ముందుకు వచ్చినా అది పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈ భామ కాస్త డీలా పడిపోయింది. అయితే నభా నటేశ్‌ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ పోతినేనితో నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం. అయితే ఈ భామ తనకు ఇష్టమైన నటుడు రామ్ అని తన గత ఇంటర్వ్యూ లలో చెపుకొచ్చింది. రామ్ ఎనర్జీ , డాన్స్ లు బాగా ఇష్టపడతాను అని , రామ్ పక్కన నటించించే అవాశం వస్తే అసలు మిస్ చేస్కోను అని చెపింది, అలాంటిది ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఛాన్స్ రావడం అంటే ఆమె కల నెరవేరినట్టేగా మరి. ఈ సినిమాలో పూనేత్ ఇషార్, సత్య దేవ్ మరియు ఇతరులు సహాయ పాత్రలలో కనిపిస్తారు. రామ్ గత చిత్రం హలో గురు ప్రేమ కోసమే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది.  మరి ఈ సినిమా మాత్రం మొత్తం అందరికీ డూ ఆర్ డై ప్రాజెక్ట్ అనే చెప్పాలి.

More Related Stories