English   

హరీష్ కి రెండో హీరో దొరికాడు !

sree vishnu may act in varun tej valmiki movie
2019-01-31 14:46:09

అల్లు అర్జున్‌ తో జువ్వాడ జగన్నాథం అనే సినిమా తెరకెక్కించిన హరీశ్‌ శంకర్‌ అది పెద్దగా హిట్ కాకపోవడంతో ఆ తర్వాత మరే సినిమా అవకాశాలు లేక సైలెంట్ గా ఉన్నాడు. తాజాగా వరుణ్‌ తేజ్‌ తో వాల్మికి అంటూ కొత్త సినిమా మొదలెట్టాడు. వరుసగా మెగా కుటుంబ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో ఇతర హీరోలను సంప్రదించినా వారినుండి సరైన స్పందన లేకపోవడంతో మెగా హీరోల స్టార్ డంనే నమ్ముకున్నాడు. 2014లో తమిళంలో విజయాన్ని సాధించిన 'జిగర్తాండ' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు. తమిళంలో బాబీసింహా చేసిన పాత్రలో మార్పులు చేసి వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఇక తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రకి గాను ముందు నాగ శౌర్య ని వార్తలు వచ్చినా ఇప్పుడు శ్రీవిష్ణును తీసుకున్నాడనేది తాజా సమాచారం. ఇక హీరోయిన్స్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తాదో వేచి చూడాలి. 14 రీల్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముందు ఈ సినిమాకి రవితేజ, సాయి ధరం తేజ్ లు లీడ్స్ గా ఉంటారని వార్తలు వచ్చాయి, ఏమయ్యిందో ఏమో గానీ చివరికి వరుణ్ తేజ్ తో తీస్తున్నట్టు కొబ్బరి కాయ కొట్టారు, మరి రెండవ హీరో శ్రీ విష్ణు ఏనా లేక మరెవరైనా ఉంటారా అనేది తేలాల్సి ఉంది.

More Related Stories