English   

ఆల్ ఈజ్ వెల్ అంటున్న సతీష్ వేగేశ్న !

hero naga shourya joins satish vegesna all is well movie
2019-01-31 15:01:30

‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ అవార్డ్‌ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దాని తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా నిరుత్సాహ పరచడంతో దానిని మరపించి మరో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఆయన తిరిగి పూర్వ వైభవం అందుకునేందుకు ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచరం. ఈ సినిమాకి హీరోగా యంగ్ హీరో నాగశౌర్య‌ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఛలో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగశౌర్య ఆ తరువాత కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల వంటి వరుస వరస పరాజయాలతో ఢీలా పడ్డాడు.  ఫ్లాప్ చిత్రాల నుండి దారి మళ్ళించి సతీష్ వేగేశ్నతో నాగ శౌర్య ‘ఆల్ ఈజ్ వెల్’ అనిపించుకోవాలనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా దర్శకుడిగా సతీష్ వేగేశ్నకు హీరోగా నాగశౌర్యకు కీలకం కానుంది ఎందుకంటే ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాలు రాకుంటే గనుక వీరిద్దరికీ కష్టమే. ఖాకీ సినిమాతో సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా ఈ సినిమాకి నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

More Related Stories