English   

బయోపిక్ కోసం బరువు పెరుగుతున్న జాన్వీ ! 

Janhvi-Kapoor
2019-02-01 11:08:39

జాన్వీ ప్రస్తుతం ఓ రెండు భారీ చిత్రాలకు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి బయోపిక్ కాగా మరొకటి హిస్టారికల్ మూవీ. మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ - గుంజన్ పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకుంటుంది.  1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో గుంజన్ కీలకపాత్ర పోషించింది. ఆమె ఎయిర్ ఫైటర్ కావడంతో దానికి తగ్గట్టుగా బాడీని షేప్ చేస్తోంది. ఇటీవల గుంజన్ లుక్ లో ఉన్న జాన్వీ ఫోటో బయటికొచ్చింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే జాన్వీకపూర్ ఈ సినిమా కోసం బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తోందట. సినిమాలో తన పాత్ర కోసం మరో 6-7 కిలోల బరువు పెరిగేందుకు జాన్వీ డైట్ చేస్తోందని బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. జాన్వీ మొదటి సినిమా ధడక్ నిర్మించిన కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలోనే వస్తున్న ఈ సినిమా మార్చి నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీంతోపాటు జాన్వీకపూర్ కరణ్‌ జోహార్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘తక్త్‌’లో కూడా నటిస్తోంది. ముందు ఈ బయోపిక్ పూర్తయ్యాక ఆ సినిమా తెరకేక్కే అవకాశం ఉంది.

More Related Stories