English   

సేతుపతి సాయం చేసినా...ఫలితం దక్కలేదు !

Vijay-Sethupathi
2019-02-01 04:32:41

ఆమె ఒక మాజీ మళయాళ నటి కానీ కాలం కలిసి రాక ఆమె అనారోగ్యంతో కాలం వెళ్ళదీస్తోంది. తాజాగా శీను రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మామనిథాన్ సినిమా షూటింగ్‌ లో తమిళ నటుడు విజయ్ ఉండగా గతంలో కొన్ని మలయాళ సినిమాలలో నటించిన కవలమ్ అచ్చమ్మ అనే వృద్ధురాలు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవంటూ విజయ్‌ను వచ్చి కలిసింది. వెంటనే స్పందించిన విజయ్ ఆమెకు కొంత డబ్బు అందజేశారు. కవలమ్ డబ్బు తీసుకుని వెళుతుండగా దారిలో స్పృహ కోల్పోయి పడిపోయింది. అక్కడ ఉన్నవారు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆర్థిక సాయం కోరి వచ్చిన ఆమెకి విజయ్ సేతుపతి వెంటనే సాయం చేశాడు, కానీ ఆమె ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచి వేస్తోంది. కవలమ్ గతంలో మలయాళం సినిమాల్లో నటించిందని సమాచారం. అయితే కవలమ్‌ కు విజయ్ సాయమందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన అభిమానులు తెగ ఖుషీ అయ్యారు కానీ ఆమె మరణం వారి ఆనందాన్ని ఎంతో సేపు నిలవనివ్వలేదు. అయినా మన ప్రాణాలకే హామీ లేదు, ఏ నిముషానికి ఏమి జరుగునో కదా ?

More Related Stories