English   

భారతీయుడు షూట్ ఆగిందా ?

INDIAN 2
2019-02-01 05:51:24

డైరెక్ట‌ర్ శంక‌ర్‌ - క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భార‌తీయుడు సినిమానో 22 ఏళ్ళ త‌ర్వాత సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జ‌న‌వ‌రి 18 నుండి చిత్ర షూటింగ్ పొల్లాచ్చిలో ప్రారంభం అయింది. రూ.180 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో తెరకేక్కిస్తున్నారట. అయితే షూటింగ్ ప్రారంభ‌మైన కొద్ది రోజుల‌కి మూవీ షూటింగ్ ఆపేశార‌ని టాక్. సెట్‌ కి సంబంధించిన ప‌నులు పూర్తి కాక‌పోవ‌డం వ‌ల‌న‌నే చిత్ర షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చార‌ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నుండగా దుల్కర్‌ సల్మాన్‌ ఒక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ మరో నెగటివ్‌ పాత్రలో నటిస్తారని వార్తలు వచ్చాయి. క‌థ ప్రకారం సినిమాకి సంబంధించిన కొంత షూటింగ్ తైవాన్‌లో జ‌ర‌గ‌నుంది. అయితే సెట్ పనులు పూర్తయ్యాక సినిమా షూట్ మళ్ళీ ప్రారంభం అవుతుందని అంటున్నారు.
 

More Related Stories