మళ్లీ రెగ్యులర్ గెటప్ లోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా హీరో కాదు.. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు. జనసేన పార్టీ పనులతో చాలా బిజీ అయిపోయాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈయన వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టాడు. పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నాడు ఈ జనసేనాని. అందులో భాగంగానే పూర్తిగా రాజకీయ నాయకుడు గెటప్ లోనే కనిపిస్తున్నాడు. పాత పవన్ కళ్యాణ్ ను చూసి చాలా రోజులు అయిపోయింది. ఇలాంటి సమయంలో సడన్ గా మళ్లీ గెటప్ మార్చాడు పవర్ స్టార్. ఒకప్పుడు సినిమా హీరోలా ఎలా ఉండేవాడో మళ్లీ మారిపోయాడు. ఇప్పుడు గెటప్ చూసి అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ ని ఎలా కనిపించేవాడో ఇప్పుడు మళ్ళీ అలా మారిపోయాడు పవర్ స్టార్. ఇదే గత కొన్ని రోజులు కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు. కానీ ఈయన మనసు మళ్ళీ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ అంచనా వేయలేరు. రాజకీయాలు బాగా వంట పట్టించుకున్నాడు పవర్ స్టార్. అందుకే ఎప్పుడు ఎలా మారిపోతున్నాడో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రచారంలో బిజీ కానున్నాడు. ఎన్నికలు మరో మూడు నెలల్లోనే వస్తుండటంతో రెస్ట్ తీసుకోవడం మర్చిపోయాడు పవన్ కళ్యాణ్. దానికితోడు జనసేన పార్టీ పనులన్నీ ఒక్కడే చూసుకోవడంతో అలసిపోతున్నారు పవర్ స్టార్.