English   

వెంకటేష్, వరుణ్ తేజ్ జోరును అడ్డుకోవడం ఎలా..

venkatesh
2019-02-02 06:32:29

ఇప్పుడు దీని గురించి మిగిలిన హీరోలు కూడా ఆలోచిస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇరవై రోజుల తర్వాత కూడా ఈ చిత్రం దూకుడు తగ్గడం లేదు. ఇప్పటి వరకు 76 కోట్ల షేర్ వసూలు చేసింది. మరో 15 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది. అదే కానీ జరిగితే సరికొత్త సంచలనాలకు అనిల్ రావిపూడి తెర తీసినట్లే. ఇప్పటి వరకు 90 కోట్ల క్లబ్బులో చేరిన సినిమాలు చాలా అరుదుగా ఉన్నాయి. అరవింద సమేత, భరత్ అనే నేను, రంగస్థలం, ఖైదీ నంబర్ 150 సినిమాలు మాత్రమే 90 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టాయి. బాహుబలి కాకుండా వీటికి మాత్రమే ఆ రికార్డులు సాధ్యమయ్యాయి. ఇప్పుడు చిన్న సినిమాగా విడుదలైన ఎఫ్2 ఏకంగా 90 కోట్ల వైపు అడుగులు వేస్తుంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. పండగ సినిమాలన్నీ నిరాశపరచడంతో ఎందుకు తిరుగులేకుండాపోయింది తొలి రోజు మంచి టాక్ రావడంతో ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే 130 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు 150 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఎటు చూసుకున్న కూడా బాక్సాఫీస్ దగ్గర ఎఫ్ 2 సినిమా సరికొత్త సంచలనాలకు తెర తీసింది. అనిల్ రావిపూడి ఈ సినిమా తో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. త్వరలోనే ఈయన ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దాంతో పాటు ఎఫ్3 కోసం కథ సిద్ధం చేస్తున్నాడు అనిల్ రావిపూడి. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. మరి ఆ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు సృష్టించబోతున్నాడో ఈ కుర్ర దర్శకుడు.

More Related Stories