English   

మిస్టర్ మజ్ను మళ్లీ దారుణంగా ముంచేసాడు కదా..

Mr-Majnu
2019-02-02 14:29:30

పాపం అఖిల్ కి ఏదో వెనుకటి జన్మ శాపం ఉన్నట్లుంది. ఏ సినిమా చేసినా కూడా పెద్దగా కలిసి రావడం లేదు. తొలి సినిమాతో మాస్ ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నించాడు. కానీ అఖిల్ ఫలితం తిప్పికొట్టింది. ఆ తర్వాత క్లాస్ గా కుమ్మేద్దాం అనుకున్నాడు అందరికీ హలో చెబితే అది కూడా పట్టించుకోలేదు ప్రేక్షకులు. విక్రమ్ కె కుమార్ లాంటి దర్శకుడు కూడా అఖిల్ కు విజయాన్ని అందించలేకపోయాడు. ఇక ఇప్పుడు వెంకీ అట్లూరి కూడా మిస్టర్ మజ్ను సినిమాతో అఖిల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా కూడా మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇప్పటివరకు కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసి మరో డిజాస్టర్ అయిపోయింది మిస్టర్ మజ్ను. అఖిల్ కెరీర్ లో ఏం చేసినా కూడా విజయం రావడం లేదు. దాంతో ఎలాంటి సినిమా చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు అక్కినేని వారసుడు. క్లాస్ లవ్ స్టోరీ.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏం చేసినా కూడా రివర్స్ లోనే వస్తుంది ఫలితం. దాంతో తర్వాత సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు. ప్రస్తుతం ఈయన కోసం క్రిష్ ఒక కథ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. అది కూడా పునర్జన్మల నేపథ్యంలో. తెలుగు ఇండస్ట్రీలో పునర్జన్మ నేపధ్యం బాగానే కలిసొచ్చింది. మగధీర, మనం లాంటి సినిమాలు చరిత్ర సృష్టించాయి. దాంతో ఇప్పుడు అఖిల్ కూడా పునర్జన్మలనే నమ్ముకుంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి కనీసం క్రిష్ అయినా అఖిల్ కోరుకున్న విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

More Related Stories