English   

యాత్ర సినిమా ఎలా ఉండబోతుంది.. ఎన్టీఆర్ కు సవాల్.

Yatra
2019-02-02 07:51:47

ఒకేసారి ఇద్దరు ముఖ్యమంత్రుల సినిమాలు రావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. దానికి తోడు తెలుగు రాష్ట్ర భవిష్యత్తును మార్చిన లెజెండరీ ముఖ్యమంత్రులు వాళ్ళు. దాంతో వాళ్ల బయోపిక్ అనగానే ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి మొదలైంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి వైయస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర.. మరొకటి ఎన్టీఆర్ మహానాయకుడు. ఇందులో ముందు నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో ఇప్పుడు మహానాయకుడుపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. మొదటి నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ఆసక్తి కూడా పెరిగిపోయింది. దానికితోడు వైయస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి లాంటి మెగాస్టార్ నటించడం కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. సెన్సార్ టాక్ కూడా అద్భుతంగా రావడంతో కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా యాత్ర సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మహీ రాఘవ. దానికి తోడు క్లైమాక్స్ లో రాజశేఖర్ రెడ్డి చనిపోయే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రంతో ఎన్టీఆర్ మహానాయకుడు పెద్ద సవాల్ ఎదురు కానుంది. మరి దీనికి మహానాయకుడు ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి..

More Related Stories