English   

హాలీవుడ్ సినిమాలో రానా ?

rana
2019-02-02 15:04:14

బాహుబలిలో భల్లాలదేవగా నటించిన రానా  ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తొలి సినిమా నుండీ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, విలక్షమైన పాత్రలతో ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. రానా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసి ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం రానాకి వచ్చినదని ఫిలింనగర్ లో హల్చల్ చేస్తోంది. ఒక భారీ హాలీవుడ్ చిత్రాల్లో ముఖ్యమైన పాత్ర కోసం రానాతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఆ సినిమా ఓకే అవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికి అయితే హాలీవుడ్ రేంజ్ లో తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి రాజేంద్ర ప్రసాద్ ఒక్కరే నటించారు. క్విక్ గన్ మురుగన్ అనే సినిమా కోసం ఆయన లీడ్ రోల్ లో నటించారు. ఆ సినిమా ఆయనకు పెద్దగా పేరు తెచ్చి పెట్టకపోయినా హాలీవుడ్ లో అడుగుపెట్టిన హిస్టరీ మాత్రం మిగిలింది.

More Related Stories