English   

నాగ్ మన్మధుడు సీక్వెల్ లో పాయల్ 

Payal-Rajput
2019-02-02 15:24:53

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో మన్మథుడు ఒకటి. అప్పటి నుండీ ఆయ‌న‌ని అభిమానులు టాలీవుడ్ మన్మథుడు అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. 2002లో విడుదలైన మన్మధుడు అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ్ ఎంతో స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఈ సినిమాకి ఇప్పడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా కథ మరియు డైలాగ్స్ అందించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నారు. అది ఇప్పటికి కుదిరింది. నాగార్జున హీరోగా ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. నటుడు, చిలసౌ తీసిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు వుంటుందట. అందులో ఒక కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో పాయల్ కి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఆల్రెడీ రవితేజ సినిమాలోనూ ఆమె ఒక కథానాయికగా ఎంపికైంది. ఈ టైంలో నాగ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం రావ‌డం అంటే అమ్మడి దశ తిరిగినట్టే. అంతే కాదండోయ్ సీత చిత్రంలోను పాయ‌ల్ ఓ స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించ‌నుంద‌ట. 

More Related Stories