English   

దర్శకుల మనసు దోచుకుంటున్న బ్యూటీ..

Nabha-Natesh
2019-02-02 15:55:00

కొన్నిసార్లు హిట్ సినిమాలతో ఇండస్ట్రీకి రాకపోవచ్చు. కానీ వచ్చిన తర్వాత హిట్లు మాత్రం వారిని వెతుక్కుంటూ వస్తాయి. కొందరు హీరోయిన్ల జాతకం అలా ఉంటుంది. వాళ్ల తొలి సినిమా ఎలా ఉన్నా కూడా తర్వాత మాత్రం వరస అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నభా నటేష్ విషయంలో ఇదే జరుగుతుంది. నన్ను దోచుకుందువటే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నభా.. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికే రవితేజ డిస్కో రాజా సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది నటేష్. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో హీరోయిన్ గా కమిట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పక్క హైదరాబాద్ పూరీ గా నటించబోతోంది నభా. ఈ క్యారెక్టర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అన్నీ కుదిరితే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ట్రై చేస్తుంది. కన్నడ ముద్దుగుమ్మ కాబట్టి తెలుగు విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే జాయిన్ కానుంది నభా. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్ కావడానికి ఆలోచిస్తుంది నటేష్. మొత్తానికి ఈ భామ దూకుడు చూస్తుంటే మరికొన్ని రోజుల్లో స్టార్ హీరోల దృష్టిలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

More Related Stories